File:Gudithanda temple 10.jpg

Original file(5,184 × 3,456 pixels, file size: 6.3 MB, MIME type: image/jpeg)

Captions

Captions

Add a one-line explanation of what this file represents

Summary

edit
Description
తెలుగు: గుడి తండా

‘‘రాజగజకేసరి కాకతీయ గణపతిదేవ మహారాజు’’ కొత్తశాసనం: మహబూబాబాద్ జిల్లా , కొత్తగూడ మండలంలో గుడి తండా గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాకతీయ కాలంలో నిర్మించబడిన త్రికూట దేవాలయం కాని ప్రస్తుతం రెండు ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మూడవ గుడి భాగం అనంతర కాలంలో తొలగించారో లేదా కూలిపోయిందో గాని మూడవ ఆలయానికి సంబంధించిన కొన్ని శిధిలాలు మాత్రం ఆలయ సమీపంలో అక్కడక్కడా పడి ఉన్నాయి.

ప్రధాన దేవాలయానికి గర్భగుడి, అంతరాలాయం ఉన్నాయి.అంతరాళ ద్వారానికి రెండు వైపులా ఇద్దరు 

శైవ ద్వారపాలకులు , ద్వార పాలకులకు రెండు వైపులా చామర గ్రాహులున్నారు. గర్భగుడి ద్వారానికి రెండు వైపులా పెద్ద కలశాలు చెక్కివున్నాయి. ద్వారం ముందు సోపానశిల పెద్దదిగా వుంది. అంతరాళంలో వినాయకుని విగ్రహముంది. మూడు వైపులా విస్తరించి ఉన్న అర్థమంటపం, రంగమంటపాలతో, 16 స్తంభాలతో ఈ దేవాలయం నిర్మించబడింది . ప్రధాన ఆలయానికి పశ్చిమ ముఖద్వారముంది. త్రికుటాలయం కాబట్టి మూడు శివలింగాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి , రంగ మంటపంలో భగ్నమైన శివలింగం కనిపిస్తున్నాయి. రంగ మంటపంలో ఉన్న శివలింగం నాలుగు అడుగుల విస్తీర్ణం, రెండున్నర అడుగుల ఎత్తున్న గుండ్రని పానవట్టం మూడు సోపానాలతో చెక్కి ఉంది . పూజలందుకుంటున్న శివలింగం యొక్క పానవట్టం ఐదు సోపానాలతో చెక్కి ఉంది. ప్రధాన ఆలయానికి కుడి వైపు ఉన్న దేవాలయ ప్రాంగణంలో అందమైన, లాలిత్యమైన వీరభద్రుని శిల్పం ఉంది . వీరభద్రుడు అత్యంత నాజూకుగా కన్పించడం విశేషం. ఆలయ ప్రాంగణంలోనే ద్వారానికి బయట ప్రత్యేకమైన అధిష్టాన పీఠంమీద వేంకటేశ్వరుని విగ్రహం వుంది. దేవాలయ ప్రాంగణంలో రెండు ఆంజనేయుల విగ్రహాలు ఉన్నాయి. రంగ మంటపంలోని ఒక స్తంభంమీద ఒకవైపు సంస్కృతభాషలో, తెలుగు లిపిలో చెక్కిన శాసనం, మరొక పక్క 4పంక్తుల తెలుగుశాసనం వున్నాయి. శాసనకాలం: కాకతీయ గణపతిదేవ చక్రవర్తి శాసనస్థలం: గుడితండా, రాజరాజేశ్వర దేవాలయం(రామనాథ దేవర గుడి) శాసనలిపి: తెలుగు శాసనభాష: తెలుగు, సంస్కృతం

ప్రస్తుతం రాజరాజేశ్వరాలయంగా పిలువబడుతున్న ఈ గుడిని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయమని పిలిచేవారని శాసనంలో రాసి ఉంది . శాసనకాలం గణపతిదేవుని పాలనాకాలమే. . గుండాల, పాలంపేట, హన్మకొండ, పర్కాల, ఘనపూరు శాసనాలలో వున్న విధంగానే ఈ శాసనంలో కూడా సంవత్సర,మాస,దిన వారాలు పేర్కొనబడలేదు. శాసనలిపిలో ‘త’ అక్షరం కొత్తగా కనిపించింది.

పాకాలశాసనంలో వున్నట్లే ఈ శాసనంలోని 12,13 పంక్తులలో ‘‘అస్మాద్యన్నహి ‘రాజగజకేసరి’ విభ్రమం గణపత్యవనీంద్ర స్యా’’ అని వుంది.

ఈ శాసనం నర్సాపూర్ పరిధిలోని గుండాల గ్రామ దేవాలయ స్తంభం మీదున్న శాసనానికి అచ్చంగా జిరాక్స్ కాపీలాగా ఉంది . 14వ పంక్తి నుంచి 18వ పంక్తి వరకు వున్న 5పంక్తులు గుండాల, పాలంపేట, హన్మకొండ, పర్కాల, ఘన్పూరులలోని శాసనాలకు అచ్చు ప్రతిలా ఉన్నాయి .( వరంగల్ జిల్లా శాసనసంపుటి- శాసనాల సంఖ్యలు 78,79,80, 81,82). ఈ వరుసలలో మాచిరాజుపల్లి నివాసి పండితారాధ్య దాసుడు బొందలపాటి సోము శరణార్తి కోరుతున్నట్లు రాయబడి ఉంది. ఈ గుడితండాతోపాటు మిగిలిన 5చోట్ల కూడా ఇదే శాసన భాగం ఉండడం విశేషం . ఈ శాసనంలోని మొదటి వైపు దేవాలయంలోని ప్రధాన దైవం రామనాథుని స్తుతి వుంది.

ఈ సంస్కృత శ్లోకాలు కొన్నిచోట్ల ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్స్  పాఖాల శాసనాన్ని పోలి ఉన్నాయి. పాఖాల శాసనంలోని 160వ పంక్తిలో, 200వ పంక్తిలో గుడి తండా దేవాలయానికి తూర్పున వున్న చెరువును ‘మౌద్గల్య తీర్థ ’ అంటారని  వుంది. 175,176,187,188, 208వ పంక్తులలో రామనాథదేవర ప్రస్తావన వుంది. అయితే గుడితండా శాసనం రెండవవైపు  రామనాథ దేవరకు కాపులైన కాచబోయడు, మల్లెబోయ ఇద్దరూ  అరువణము(పాల గుండిగ, లేదా గిన్నె), దీపాలకు నేయి సేవచేసుకున్నట్లుగా వుంది. 

కాకతీయ శాసనాలను పరిశోధించినప్పుడు కాకతీయరాజుల బిరుదులలో కొన్ని ‘గజకేసరి’తో ముగిసేవి వున్నాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించిన బయ్యారం శాసనం ద్వారా కేసరి తటాకాన్ని తవ్వించిన మొదటి ప్రోలరాజుకు ‘అరిగజకేసరి’ బిరుదు ఉన్నట్లు తెలుస్తోంది. రుద్రదేవుని సామంతుడు మల్లిరెడ్డి వేయించిన బెక్కల్లు శాసనం రుద్రదేవున్ని ‘దాయగజకేసరి’ అనే బిరుదుతో కీర్తిస్తున్నది.

పాకాలశాసనం గణపతిదేవున్ని ‘రాజగజకేసరి’ బిరుదుతో వర్ణించింది.

‘‘ ఏ తన్మాద్యన్మహారాజ గజకేసరి విభ్రమమ్ గణపత్యవనీంద్రస్య’’.. రాజగజకేసరి అన్న బిరుదు గణపతిదేవుని సార్వభౌమత్వాన్ని వ్యక్తం చేస్తుందని పివి పరబ్రహ్మశాస్త్రి గారు ‘కాకతీయులు’లో వివరించారు. రుద్రమదేవి సామంతుడు భైరవుడు వేయించిన బీదరు శాసనంలో 3సార్లు ‘రాయగజకేసరి’ బిరుదు పేర్కొనబడ్డది. రెండుసార్లు గణపతిదేవుని పరంగా, ఒకసారి రుద్రమదేవిపరంగా ‘రాయగజకేసరి’ చెప్పబడ్డది. తేరాల సిద్ధేశ్వరాలయ శాసనంలో ప్రతాపరుద్రున్ని కీర్తించే సందర్భంగా ‘దాయగజకేసరి’ అన్న బిరుదు ప్రత్యేకంగా రాయబడి ఉంది .

ఈ దేవాలయం వెనక తూర్పున ఒక చెరువుంది. గతంలో ఇక్కడ కోయలు నివాసం ఉండేవారట. ఒక కోయ కన్య చెరువులో స్నానం చేయడానికి దిగి కనిపించకుండా పోయి మూడు రోజుల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చిందిట. కారణం అడిగిన తల్లికి తాను చెరువులో మునగగానే చెరువు కింది భాగంలో ఒక గుడి, గుడి లోపల శివుడు కనిపించాడని, 3 రోజులు తాను శివుడి సాన్నిధ్యంలోనే ఉన్నానని, శివుడు పంపిస్తే తిరిగి వచ్చానని ఆ అమ్మాయి చెప్పిందిట. ఈ జానపద కధ ఆధారంగా చెరువులో గుడి ఉందని ఇప్పటికి స్థానికులు భావిస్తుండడం విశేషం .
Date
Source Own work
Author Torchtelangana

Licensing

edit
I, the copyright holder of this work, hereby publish it under the following license:
w:en:Creative Commons
attribution share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
You are free:
  • to share – to copy, distribute and transmit the work
  • to remix – to adapt the work
Under the following conditions:
  • attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
  • share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.

File history

Click on a date/time to view the file as it appeared at that time.

Date/TimeThumbnailDimensionsUserComment
current06:35, 18 September 2023Thumbnail for version as of 06:35, 18 September 20235,184 × 3,456 (6.3 MB)Torchtelangana (talk | contribs)Uploaded own work with UploadWizard

There are no pages that use this file.

Metadata