File:Yerukala lifestyle .jpg
Original file (1,737 × 1,433 pixels, file size: 892 KB, MIME type: image/jpeg)
Captions
Summary edit
DescriptionYerukala lifestyle .jpg |
ఎరుకలు-జీవన విధానం: ఎరుకల గిరిజనులను మహారాష్ట్రలోని కైకాడీ,కర్ణాటక కొరమరా,తమిళనాడులో కొరద-కొరచ,పాండిచ్చేరిలో నిద్దనారు, మధ్యప్రదేశ్ లో కుర్రు అని పేర్కొంటారు.
వృత్తి ఆధారంగా ఎరుకలలో ఉపతెగ వర్గీకరణ జరిగింది.అవి కుంచె ఎరుకల, ఈతపుల్లల ఎరుకల, దబ్బ ఎరుకల, నార ఎరుకల, ఉప్పు ఎరుకల, జేరగాండ్రు ఎరుకల, పరికి ముక్కల ఎరుకల మెుదలైనవి.
వీరు ఎల్లమ్మ, పోచమ్మ,మైసమ్మ, ఉప్పలమ్మ,సమ్మక్క-సారలమ్మ,కొంరెల్లి మల్లన్న,కట్ట మల్లన్న, ఐలోని మల్లన్న దేవతలను పూజిస్తారు. జీవితచక్ర సంబంధాలు: ప్రసవము ఇంటిదగ్గర మంత్రసాని సహాయంతో జరుపుతారు.ప్రసవ సమయాన్ని శుభకార్యంగా భావిస్తారు. శిశువులకు స్నానం చేయించడానికి మూరెడులోతు గుంతను తవ్వుతారు.దీన్నే కొల్లు అని అంటారు.శిశువుకు 21 రోజు వచ్చేవరకూ ఇక్కడే స్నానం చేయిస్తారు.21 రోజులు దాటిన తర్వాత కొల్లుగుంటను పూడ్చివేసి,చీరతో ఉయ్యాలను చేసి,ఆ ఉయ్యాలలో శిశువును వేసే ఆ రోజే నామకరణం చేస్తారు.బాలింత స్త్రీ తన ఇంటిపైన బియ్యం గింజలు వేస్తే ఎలుకలు రావనే నమ్మకంతో బాలింతలు తమ ఇంటిపైన బియ్యం గింజలు చల్లమని కోరుతారు.అలాగే వెల్లుల్లి లేదా ఉల్లిపాయ బాలింత చేతిలో పెడతారు.శిశువుకు పుట్టిన 11 రోజులలోపే బొడ్డుచుట్టూ నాలుగు వాతలు పెడతారు.తమ ఇష్ట దైవం దగ్గర పుట్టువెంట్రుకలు తీస్తారు. వృత్తులు: 1.బుట్టలు అల్లడం. 2.పాలగంప అల్లడం 3.కలగూర గంపలు అల్లడం. 4.పెండ తట్టలు. 5.బావులు పూడిక తీయడానికి ఉపయెూగించే గంపలు. 6.కోళ్ళ గూడు. 7.గుమ్మీల తయారీ. 8.తడకలు చేయడం. 9.చాటలు తయారుచేయడం. 10.సోది చెప్పటం (ఎరుకల సాని) తయారీ విధానం: గంపలు అల్లడానికి ఈతకట్టెను ఉపయెూగిస్తారు ఈతకట్టెల కోసం ఈత వనాలకు వెళ్ళి ఈతకట్టెను తెచ్చి పచ్చి బరిగెను చీల్చి ఎండబెడతారు.ఎండిన ఈత బరిగెను ఎన దెబ్బ,వరదెబ్బ,ఈనె వరదెబ్బ గా చీలుస్తారు.ఈనె వరదెబ్బలను గంప క్రింది భాగం చేయడానికి వాడుతారు. మిగిలిన వాటిని గంప ప్రక్క భాగాలను చేయడానికి వాడుతారు.
|
Date | 30 November 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing edit
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 14:54, 30 November 2017 | 1,737 × 1,433 (892 KB) | Adbh266 (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file:
File usage on other wikis
The following other wikis use this file:
- Usage on meta.wikimedia.org
- Usage on te.wikipedia.org